అమ్మ ఒడి పథకం యధాతథంగా అమలు..
సందేహాలు వద్దు: మంత్రి సురేశ్
అమ్మఒడి పథకం యధాతథంగా అమలు
చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
నెల్లూరు పట్టణంలో జరుగుతున్నందున
కోడ్ పరిధిలోకి రాదు, రేపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు
పూర్తి.
ఇప్పటికే జీవో కూడా విడుదల
మొత్తం 44,00,891 మందికి ‘అమ్మఒడి' అమలు
వరుస సెలవులతోనే 11కి
వాయిదా
టాయిలెట్ల నిర్వహణకు రూ.వెయ్యి
ఏపీలో ఈనెల 11వ తేదీన అమలు జరపాలని నిర్ణయించిన జగనన్న అమ్మఒడి పథకం ఆగబోదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ‘అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. జీవో నంబర్ 3 విడుదల చేశామని.. 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామన్నారు. జనవరి 11వ తేదీన తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు..
0 Komentar