ఫిబ్రవరి 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీ
కేంద్రాలను పునఃప్రారంభించాలని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు నిర్ణయించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55వేల
అంగన్‌వాడీ కేంద్రాలు గతేడాది మార్చి నెలాఖరు నుంచి మూతపడ్డాయి. అప్పటి నుంచి
వాటిల్లోని లబ్ధిదారులైన 30 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇంటికే సరకులు
అందిస్తున్నారు. కేంద్రాల పునఃప్రారంభంపై ఇటీవల మహిళాశిశు సంక్షేమశాఖ అధికారులు 3 నుంచి 6 సంవత్సరాల వయసున్న చిన్నారుల తల్లిదండ్రుల
నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. 65% మంది తల్లిదండ్రులు
కేంద్రాలను ప్రారంభించేందుకు సమ్మతి తెలిపారు. 66% మంది
ఇంటికి సరకులు అందించకుండా కేంద్రాల్లోనే పిల్లలకు భోజనం వడ్డించి అందించాలని
కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కేంద్రాల్లోనే చిన్నారులకు మధ్యాహ్న భోజన
పథకాన్ని అమలు చేయనున్నారు. గర్భిణులు, బాలింతలకు మాత్రం
ఇంటికే సరకులు అందిస్తారు.
0 Komentar