AP Covid-19 Media Bulletin 02-01-2021
ఏపీలో కొత్తగా మరో 238 కరోనా
కేసులు
ఏపీలో కొత్తగా మరో 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 48,518 శాంపిల్స్ పరీక్షించగా ఈ కేసులు బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ
వైరస్‌తో తాజాగా మరో 279మంది కోలుకొని డిశ్చార్జి కాగా..
పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చొప్పున మొత్తంగా
ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యశాఖ విడుదల
చేసిన బులెటిన ప్రకారం.. ఇప్పటివరకు ఏపీలో 1,19,32,603
శాంపిల్స్ పరీక్షించగా.. 8,82,850 పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి. వీరిలో 8,72,545 మంది కోలుకొని డిశ్చార్జి
కాగా.. 7111 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం
3194 క్రియాశీల కేసులు ఉన్నాయి.
0 Komentar