AP Covid-19 Media Bulletin 06-01-2021
ఏపీలో కరోనా: కొత్తగా మరో 289 కేసులు
ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. మంగళవారం 51,207 శాంపిల్స్‌ను పరీక్షిచంగా ఈ కేసులు బయటపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి తాజా పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా 428 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కృష్ణా, ప్రకాశం, విశాఖలలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,21,05,121 శాంపిల్స్ పరీక్షించగా.. 8,83,876 పాజిటివ్
కేసులు నమోదయ్యాయి. వీటిలో 8,73,855మంది కోలుకొని డిశ్చార్జి
కాగా.. 7,125 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం
రాష్ట్రంలో 2,896 క్రియాశీల కేసులు ఉన్నట్టు రాష్ట్ర
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.
0 Komentar