AP Covid-19 Media Bulletin 24-01-2021
ఏపీలో కొత్తగా 158
కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24
గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్
విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,147
మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 155 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,387కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,476 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,28,76,113 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో
వెల్లడించింది.
0 Komentar