AP Covid-19 Media Bulletin 26-01-2021
ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24
గంటల్లో 38,323 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 172 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర
వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల
సంఖ్య 8,87,238కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,150 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 203 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,731కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,357 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,29,42,153 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో
వెల్లడించింది.
0 Komentar