AP Elections: Notification for AP Panchayat Elections Released
ఏపీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్, నేటి
నుంచే కోడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. జనవరి 23వ తేదీ నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు.
ఇక, ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13 మూడో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ప్రకటించారు. ఇక, పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
ముఖ్యమైన తేదీలివే..
తొలి దశ
నోటిఫికేషన్ జారీ- జనవరి 23
నామినేషన్ల స్వీకరణ- జనవరి 25
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు -
జనవరి 27
నామినేషన్ల పరిశీలన- జనవరి 28
నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 5 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
రెండో దశ
నోటిఫికేషన్ జారీ- జనవరి 27
నామినేషన్ల స్వీకరణ- జనవరి 29
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు -
జనవరి 31
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1
నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 9 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
మూడో దశ
నోటిఫికేషన్ జారీ- జనవరి 31
నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు -
ఫిబ్రవరి 4
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5
నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 13 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
నాలుగో దశ
నోటిఫికేషన్ జారీ- ఫిబ్రవరి 4
నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6
నామినేషన్ల సమర్పణకు చివరిరోజు -
ఫిబ్రవరి 8
నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9
నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12
ఎన్నికల పోలింగ్ - ఫిబ్రవరి 17 (ఓట్ల లెక్కింపు అదే రోజు)
0 Komentar