AP Govt Announced Holiday on Panchayat
Election Polling Days
ఏపీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజు
సెలవు.. వివరాలివే
ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన
ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రోజున సెలవు ప్రకటించాలని సూచించింది. ప్రక్రియకు
సంబంధించి ప్రభుత్వపరంగా మొత్తం తొమ్మిది జీవోలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
వేర్వేరుగా జారీ చేశారు.
పోలింగ్ రోజుల్లో సెలవులు
వేర్వేరుగా ఉత్వర్వులు
ఏపీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజుల్లో సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పొలింగ్ జరిగే ఫిబ్రవరి 9, 13, 17, 21న స్థానిక సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రోజున సెలవు ప్రకటించాలని సూచించింది. ఎన్నికలు జరిగే రోజుల్లో ఉద్యోగులకు ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1988 ప్రకారం చెల్లింపులతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు.
పొలింగ్ జరిగే తేదీలకు 44 గంటలకు ముందు ఆయా ప్రాంతాలలో మద్యం షాపులు మూసి వేయాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. అలాగే ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని మరో ఉత్తర్వు ఇచ్చింది. ఎన్నికల విధులలో ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపింది. ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వపరంగా మొత్తం తొమ్మిది జీవోలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వేర్వేరుగా జారీ చేశారు.
పోలింగ్ బాక్సులు, సిబ్బందిని
పోలింగ్ కేంద్రాల వద్దకు చేరవేసేందుకు భారీగా వాహనాలు అవసరమైనందున పలు ప్రభుత్వ
శాఖలకు చెందిన వాహనాలు వినియోగించుకునేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసు, అగ్నిమాపక, ట్రాన్స్‌కో, జెన్‌కో, యూనిసెఫ్
ఇచ్చిన వాహనాలు, ట్రైనింగ్ కళాశాలల వాహనాలు, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర వాహనాలు వినియోగించుకోవాలన్నారు.
G.O.RT.No. 40 Dated: 29-01-2021.
0 Komentar