AP: ఈనెల 25 ఇంటర్ తుది విడత అడ్మిషన్లకు గడువు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల
రెండో ఫేజ్ ఈనెల 25 వరకు కొనసాగుతుందని బోర్డు కార్యదర్శి వి.
రామకృష్ణ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, వెల్ఫేర్, రెసిడెన్షియల్, మోడల్
జూనియర్ కళాశాలల్లో వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు
సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియే చివరి ఫేజ్ అని
స్పష్టం చేశారు అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు ఆలోగానే కళాశాలలకు హాజరు
కావాలని, మరోసారి గడువు పొడిగించడం ఉండదని వివరించారు. ఇంటర్
జనరల్ తోపాటు వొకేషనల్ కోర్సులకు కూడా ఈ నెల 25లోగా
అడ్మిషన్లు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కోవిడ్- 19 కోసం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన స్టాండర్డ్
ఆపరేటింగ్ ప్రొసీజర్ ను(ఎస్ వోపీ) రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో పక్కాగా
అమలు చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నేపథ్యంలో
విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో మల్టీ లేయర్ సేఫీ నిబంధనలు
అమలు చేయాలని సూచించింది. అలాగే కళాశాలల్లో రోజూ నిర్వహించే అసెంబ్లీని రద్దు
చేయాలని బోర్డు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు 15
రోజులకోసారి శనివారాల్లో హెల్త్ చెకప్స్ తప్పని సరిగా జరపాల్సి
ఉంటుంది. ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆరోగ్య రికార్డులను కళాశాలలు
నిర్వహించాలి.
0 Komentar