Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Panchayat Election Schedule Suspended

 

AP Panchayat Election Schedule Suspended

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ నిలిపివేత 

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌  రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. తాజా తీర్పు నేపథ్యంలో డివిజినల్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ నెల 8న ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags