AP Teacher Transfers-2020: Change in the Teacher Transfer Schedule
ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ లో మార్పు
ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యా
శాఖ కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు సర్వీసు
పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులను
న్యాయస్థానం కొట్టేసింది. దీంతో 5 అకడమిక్ సంవత్సరాలు పూర్తి
చేసుకున్నవారికే తప్పనిసరి బదిలీ ఉంటుంది. పదోన్నతులు, ఉన్నతీకరణ
పోస్టులను ఖాళీలుగా చూపాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై
ఉపాధ్యాయులకు అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ రెండింటిని
పేర్కొంటూ పాఠ శాల విద్యా శాఖ సంచాలకులు చినవీరభద్రుడు బదిలీల షెడ్యూలో మార్పులు
చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం నుంచి ఈ నెల 11 వరకు
ఖాళీల ప్రదర్శన, తెలుగు, హిందీ స్కూల్
అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు వెబ్ ఐచ్చికాల నమోదుకు 12
నుంచి 16 వరకు అవకాశం కల్పించారు. తుది
సీనియారిటీ జాబితాను 17-18 మధ్య విడుదల చేయనున్నారు. ఈ
ప్రక్రియ పూర్తయ్యేందుకు 10 రోజుల సమయం పట్టనుంది. 2019లో పదోన్నతులు పొందిన, ఉన్నతీకరించిన పోస్టులను
ఖాళీలుగా చూపాలని కొందరు ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ స్థానం
ఆదేశాలు ఇవ్వడంతో కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు.
0 Komentar