APPSC Recruitment 2021: APPSC Will
Conduct Exams on Online Mode From 2021
ఇకపై ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే..?
ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై నిర్వహించే అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి ట్యాబ్‌ల ద్వారానే కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించగా.. పరీక్ష నిర్వహణ, భద్రత సహా ఇతర టెక్నికల్ అంశాలపై స్పష్టత వచ్చింది. దీంతో భవిష్యత్తులోనూ ఇదే తరహాలో పరీక్షలు జరపాలని భావిస్తోంది.
ఆన్‌లైన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహిస్తే కొశ్చన్ పేపర్స్ లీకయ్యే అవకాశమే ఉండదని అధికారులు చెబుతున్నారు. దీంతో పర్మనెంట్‌గా ఈ విధానమే అమలు చేయాలని సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల నోటిఫైడ్ పోస్టులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో అమల్లోకి తేనున్నట్లు కూడా తెలుస్తోంది. త్వరలో ఈ అంశాలపై స్పష్టత రానుంది.
0 Komentar