Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ban on Certain Chinese Apps Including TikTok to Continue for Now: MeitY

 


Ban on Certain Chinese Apps Including TikTok to Continue for Now: MeitY

చైనా యాప్‌లపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

టిక్‌టాక్‌ సహా వివిధ చైనా యాప్‌ల వినియోగంపై దేశీయంగా విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు యాప్‌ యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. నిషేధం పొడిగింపుపై స్పందించిన టిక్‌టాక్‌.. భారత చట్టాలు, నిబంధనలను పాటించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల గోప్యతే తమ తొలి ప్రాధాన్యమని టిక్‌టాక్‌ పేర్కొంది.  భద్రత విషయంలో ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. 

దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రత, ప్రయోజనాల దృష్ట్యా గతేడాది జూన్‌లో టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌లో పబ్జీతోపాటు మరో 118 యాప్‌లను సైతం షేధిత జాబితాలో చేర్చింది.

India banned Chinese Apps

Previous
Next Post »
0 Komentar

Google Tags