BEL Recruitment 2021: Non Executives
Engineering Assistants And Technicians
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో (బిఈఎల్) 52 జాబ్స్.. రూ.90 వేల వరకూ జీతం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.300. ఫిబ్రవరి 3, 2021 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రకటనలో సూచించిన అర్హతలు, ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను తదుపరి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 52
1) ఇంజినీరింగ్ అసిస్టెంట్
ట్రెయినీ(ఈఏటీ): 25 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్-14, మెకానికల్-10, ఎలక్ట్రికల్
ఇంజినీరింగ్-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 01.02.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీ-మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ-ఐదేళ్లు, పీడబ్ల్యూడీ-పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
2) టెక్నీషియన్ సీ: 27 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రో
మెకానిక్-17, ఫిట్టర్-03, మెషినిస్ట్-06,
వెల్డర్-01.
అర్హత: ఎస్ఎస్ఎల్‌సీ + ఐటీఐ +
ఏడాది అప్రెంటిస్‌షిప్/ మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు
చేసి ఉండాలి.
వయసు: 01.02.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీ-మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ-ఐదేళ్లు, పీడబ్ల్యూడీ-పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం:
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రకటనలో సూచించిన అర్హతలు, ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను తదుపరి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. దీన్ని పార్ట్-1, పార్ట్-2గా విభజించారు. పార్ట్-1 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష. ఇది 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్, కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-2 టెక్నికల్ ఆప్టిట్యూడ్ పరీక్ష, 100 మార్కులకు ఉంటుంది. ఇది టెక్నికల్/ ప‌్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ మనం ఎంచుకున్న సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తుకు చివరి తేది:
ఫిబ్రవరి 03, 2021.
వెబ్‌సైట్: https://www.bel-india.in/
0 Komentar