వారంలో 'పది' పరీక్షల షెడ్యూలు - ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో బడులు - విద్యా శాఖ మంత్రి
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ పరీక్షలను 11 ప్రశ్నా పత్రాలతోనా లేక ఆరింటితో నిర్వహించాలా అనేదానిపై త్వరలో నిర్ణయం
తీసుకుంటామని వెల్లడించారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని,
ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు ఉండొచ్చని
తెలిపారు. ఉన్నత విద్య నియం త్రణ, పర్యవేక్షణ కమిషన్ డైరీ
ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలు ఉదయం నుంచి
సాయంత్రం వరకు నిర్వహిస్తామని, కేంద్రం జారీ చేసే కొవిడ్-19
నిబంధనలను పరిశీలించి 1-5 తరగతులకు బడులు పునః
ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
0 Komentar