TS: ఇంటర్ పరీక్షల రుసుం
చెల్లింపు తేదీల వివరాలివే
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ
సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
ప్రకటించారు. నేటి నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఎలాంటి
ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.100
ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 22వరకు గడువు ఇవ్వగా.. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 2 వరకు ఫీజు చెల్లించవచ్చని
పేర్కొన్నారు. రూ.1000 ఆలస్య రుసుంతో మార్చి 9 వరకు.. రూ.2వేల ఆలస్య రుసుంతో మార్చి 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చినట్లు జలీల్ వెల్లడించారు.
0 Komentar