CBDT rejects further extension of I-T
returns due date, says pay penalty if not filed ITR
ఆడిట్ రిటర్నుల గడువు పెంచేది లేదు
ఫిబ్రవరి 15లోగా సమర్పించాల్సిందే - విజ్ఞప్తుల్ని
తోసిపుచ్చిన ఆర్థిక శాఖ
ఆడిట్ అవసరమైన రిటర్నుల సమర్పణకు
గడువు పెంచే యోచన లేదని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. గడువు పెంచాలని కోరుతూ వివిధ
వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని తోసిపుచ్చింది. ఫిబ్రవరి 15లోగా
ఈ రిటర్నులు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను
రిటర్నుల (ఐటీఆర్) గడువు తేదీని ఈనెల 10 వరకు, కంపెనీలకు ఫిబ్రవరి 15వరకు గడువు పెంచుతూ కాగా,
గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా గడువు
పెంచాలని అభ్యర్ధన రావడంతో, గడువు పెంపు లేదని స్పష్టత ఇస్తూ
ఆర్ధిక శాఖ ట్వీట్ చేసింది. ఐటీ చట్టం ప్రకారం, ఆడిట్
రిటర్నులు సమర్పించడానికి ఒక నెల ముందే ఆడిట్ రిపోర్టు సమర్పించాలి. అంటే ఈ నెల 15లోగా రిపోర్టు సమర్పించి, వచ్చే నెల 15 లోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐటీ రిటర్నులు 5%
పెరిగాయ్: 2018-19 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం) ఆదాయపు
పన్ను రిటర్నులు 5 శాతానికి పైగా పెరిగాయని ఆదాయపు పన్ను
విభాగం వెల్లడించింది. ఈ నెల 10వరకు గడువు ఉండగా, సుమారు 5.95 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని
తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 5.67 కోట్ల ఐటీ
రిటర్నులతో పోలిస్తే ఇవి 5 శాతం కంటే ఎక్కువ.
0 Komentar