CBSE Exams 2021, NEET 2021, IIT JEE Adv 2021,
JEE Main 2021: Imp Updates
2021: CBSE, NEET, JEE పరీక్షలకు సంబంధించి తాజా అప్‌డేట్
విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొన్ని పరీక్షల తేదీలను ప్రకటించింది.
కరోనా ఎఫెక్ట్ సీబీఎస్‌ఈ 10, 12 బోర్డు పరీక్షలు, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్-2021, నీట్ -2021, రాష్ట్ర ప్రభుత్వాల బోర్డు పరీక్షల షెడ్యూల్ పై పడనున్న విషయం తెలిసిందే. స్కూళ్లు, కాలేజీల మూత కారణంగా క్లాసులు సరిగా జరగకపోవడం.. ప్రిపేర్ కావడానికి తగిన సమయం లేక పోవడంతో పరీక్షలను జూన్ వరకు వాయిదా వేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొన్ని పరీక్షల తేదీలను ఇటీవల ప్రకటించింది.
JEE MAIN 2021:
ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్-2021 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షను నాలుగు సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనుంది. ఈ పరీక్షను ఈ సారి అనేక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు.
JEE Advanced 2021:
ఈ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నేడు(జనవరి 7) ప్రకటించనున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు అనుసరించనున్న విధానాన్ని సైతం ఆయన వివరించనున్నారు. జేఈఈ మెయిన్ 2020 పరీక్షలో క్వాలిఫై అయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2020 పరీక్షకు హాజరు కాలేకపోయినవారు నేరుగా జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు.
NEET 2021:
నీట్-2021 పరీక్షలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి తేదీలు ప్రకటించలేదు.
CBSE Board Exams 2021:
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. మే 4
నుంచి పరీక్షలు ప్రారంభమై.. జూన్ 10న ముగియనున్నట్లు
ప్రకటించారు. జూలై 15న ఫలితాలను వెల్లడించనున్నట్లు
ప్రకటించారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మే 1న ప్రారంభం
అవుతాయని వివరించారు.
0 Komentar