Central Government Launched Union Budget
Mobile App – Know the Details
కేంద్ర బడ్జెట్ యాప్.. విశేషాలు
తెలుసుకోండి
త్వరలో ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్- 2021 ప్రతులను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్ పత్రాలను వెబ్‌సైట్‌లో పొందే వీలున్నా.. దాన్ని మరింత సులభతరం చేస్తూ, మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఇటీవల హల్వా వేడుక సందర్భంగా ‘Union Budget Mobile App’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) దీన్ని రూపొందించింది.
* బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగం, వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక బిల్లు.. ఇలా 14 రకాల బడ్జెట్ పత్రాలను ఈ యాప్‌లో పొందొచ్చు.
* హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పత్రాలు అందుబాటులో ఉంటాయి.
* మొబైల్‌లో బడ్జెట్ పత్రాలను వీక్షించడమే కాక.. డౌన్‌లోడ్ చేసుకునే వీలూ ఉంది. పత్రాలను ప్రింట్ చేసుకోవచ్చ కూడా.
* జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఫీచర్ల ద్వారా సులువుగా చదువుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ చేసే వెసులుబాటూ కల్పించారు.
* బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింకులనూ యాక్సెస్ చేయొచ్చు.
* ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్‌ను బడ్జెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్ పత్రాలు అందుబాటులోకి వస్తాయి.
0 Komentar