CIPET Skill Development Training
Programs for Unemployed Youth
నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య
శిక్షణ.. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి
సీపెట్ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (సీపెట్) డైరెక్టర్ కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
దిల్లీలోని జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలలపాటు చర్లపల్లిలో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, యంత్రాల నిర్వహణ తదితర అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా యూనిఫాంతో పాటు భోజనం, వసతి ఏర్పాటు చేస్తామన్నారు.
ఎనిమిదో తరగతి లేదా ఆపై చదివిన
నిరుద్యోగ యువత దీనికి అర్హులని వెల్లడించారు. పూర్తి వివరాలకు 9959333417,
7893586494, 9941404804 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
0 Komentar