CISF ASI Recruitment 2021 Apply For 690
Posts of Assistant Sub Inspector
సీఐఎస్ఎఫ్‌లో 690 ఏఎస్‌ఐ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 690 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. 690 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 690 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫైనల్ సెలక్షన్ నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2021 ఫిబ్రవరి 5 దరఖాస్తుకు చివరితేది.
లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 690
అన్ రిజర్వ్‌డ్- 536
ఎస్‌సీ- 103
ఎస్‌టీ- 51
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై
ఉండాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్
(జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్
(ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2021
వయస్సు: 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు
ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్
స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.cisf.gov.in/ OR https://www.cisf.gov.in/cisfeng/
0 Komentar