DRDO Recruitment 2021: Apply Online For
150 Apprentice Posts
డీఆర్డీఓలో 150 అప్రెంటిస్ జాబ్స్
DRDO Jobs 2021: డీఆర్డీఓ
తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డీఆర్డీఓకి చెందిన Gas Turbine Research Establishment (GTRE) కోసం ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వీటికి ఎంపికైన వారికి నెలకు రూ. 9
వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు. ఇంత పెద్ద సంస్థలో అప్రెంటీస్ గా ఉద్యోగ
జీవితం ప్రారంభిస్తే అనుభవంతో పాటు భవిష్యత్ లో మంచి ఉద్యోగావకాశాలు
లభించనున్నాయి. ఈ ఉద్యోగాలకు నేటి (జనవరి 5) నుంచి దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జనవరి 29 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
Graduate apprentice trainees: విభాగంలో 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత
కోర్సుల్లో డిగ్రీ, బీఈ, బీటెక్ చేసిన
వారు దరఖాస్తుకు అర్హులు.
Diploma apprentice trainees: విభాగంలో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్
లో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
ITI apprentice trainees: ఈ
విభాగంలో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్
తర్వాత రెండేళ్ల పాటు ఒకేషనల్ కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
0 Komentar