EAMCET -2020 Admissions: Seat Allotment List Released after Second Phase
రాష్ట్రవ్యాప్తంగా 27
వేల 870 సీట్లు ఖాళీ
ఎంసెట్- 2020 రెండో దశ కౌన్సెలింగ్ సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా మొత్తం 27 వేల 870 సీట్లు భర్తీ కాలేదని ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఎంఎం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో రెండో దశ కౌన్సెలింగ్ కు 91 వేల 99 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 30 వేల 215 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు.
రెండో దశలో 52 వేల 360 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 258 కళాశాలల్లో 99 వేల 420 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 75 వేల 985 సీట్లు భర్తీ కాగా 23 వేల 435 సీట్లు భర్తీ కాలేదు. 25 యూనివర్సిటీ కళాశాలల్లో 8035 సీట్లు అందుబాటులో ఉంటే 5 వేల 722 భర్తీ అయ్యాయి. 232 ప్రైవేట్ కళాశాలల్లో 93 వేల 385 సీట్లు అందుబాటులో ఉండగా 70 వేల 263 భర్తీ అయ్యాయి. 120 ఫార్మసి కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 4133 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 345 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 61 ఫార్మా డి కళాశాలల్లో 675 సీట్లు అందుబాటులో ఉండగా 28 సీట్లు భర్తీ అయ్యాయి.
మూడు కోర్సుల విభాగాల్లో లక్షా 4 వేల 228 సీట్లు అందుబాటులో ఉండగా 76 వేల 358 సీట్లు భర్తీ అయ్యాయి. 27 వేల 870 సీట్లు మిగిలాయని కన్వీనర్ ఎంఎం నాయక్ వివరించారు
0 Komentar