ECIL Apprentice Recruitment 2021:
Notification Out for Graduate Engineer and Diploma Apprentice Posts
ఈసీఐఎల్‌లో 180 అప్రెంటిస్ ఖాళీలు
అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా)
అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 180
అప్రెంటిస్-ఖాళీలు: గ‌్రాడ్యుయేట్
ఇంజినీర్ అప్రెంటిస్-160, టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్-20.
విభాగాలు: ఈసీఈ, సీఎస్ఈ,
మెకానికల్, ఈఈఈ, సివిల్.
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
160 ఖాళీలు
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: 01
ఏప్రిల్ 2018 తర్వాత ఎవరైతే సంబంధిత బ్రాంచుల్లో బీఈ/
బీటెక్ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
వయసు: 31.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు
ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు
ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
2) టెక్నీషియన్ (డిప్లొమా)
అప్రెంటిస్: 20 ఖాళీలు
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: 01
ఏప్రిల్ 2018 తర్వాత ఎవరైతే సంబంధిత బ్రాంచుల్లో
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
వయసు: 31.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు
ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు
ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో
సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే బీఈ/
బీటెక్‌లో సాధించిన మార్కులు, డిప్లొమా అప్రెంటిస్ అయితే
డిప్లొమా (ఇంజినీరింగ్) లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా (నాట్స్ పోర్టల్) దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 15.01.2021.
అప్రెంటిస్ ట్రెయినింగ్ మొదలయ్యే
తేది: 04.02.2021.
0 Komentar