The Final List of Voters in The Telugu
States Has Been Finalized
తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల తుది
జాబితా ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు: 4.04
కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది
జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378
మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. వీరిలో మహిళా ఓటర్లు 2,04,71,506 ఉండగా.. పురుష ఓటర్లు 1,99,66,737 మంది ఉన్నారు.
సర్వీసు ఓటర్లు 66,844 మంది, థర్డ్
జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు పేర్కొంది. 2021 జనవరి నాటికి రాష్ట్రంలో కొత్తగా 4,25,860 మంది
ఓటర్లు పెరిగారని ఎస్‌ఈసీ తెలిపింది.
తెలంగాణలో మొత్తం ఓటర్లు: 3.01
కోట్లు
2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటరు
జాబితాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం
3,01,65,569 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తాజా సవరణలో 2,82,497 ఓట్లను
చేర్చగా.. 1,72,255 ఓట్లను తొలగించినట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు
1,50,02,227 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 1,51,61,714 మంది, ఇతరులు
1,628 మంది ఉన్నట్లు ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. కొత్తగా ఓటు హక్కు
వచ్చిన వారు 2,82,497 మంది ఉన్నట్లు తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో
43,11,803 ఓటర్లు, అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,14,291 మంది
ఓటర్లు ఉన్నట్లు శశాంక్ గోయల్ చెప్పారు.
0 Komentar