HCL Tech to hire 20,000 people in next
4-6 months: CEO Vijayakumar
హెచ్‌సీఎల్ 20 వేల నియామకాలు - వచ్చే రెండు త్రైమాసికాల ప్రణాళిక
రానున్న రెండు త్రైమాసికాల్లో (4-6 నెలల్లో) 20,000 మందిని నియమించుకునే యోచనలో ఉన్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఆర్డర్ల రాక గణనీయంగా పెరగడం, డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం వేగవంతమైన నేపథ్యంలో అవసరాలకు తగ్గట్లుగా సిబ్బందిని పెంచుకోవాలని కంపెనీ భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇందులో 15 శాతం ఆన్‌షోర్ నియామకాలు కాగా.. మిగిలినవి ఆఫ్‌షోర్ నియామకాలు..ఫ్రెషర్స్‌తో పాటు నైపుణ్య అనుభవం ఉన్న వాళ్లను నియమించుకోనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది.
2020 డిసెంబరు చివరినాటికి
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,59,682. అక్టోబరు- డిసెంబరులో 6,597 మందిని నియమించుకుంది.
ఐటీ సేవల విభాగంలో వలసల రేటు 10.2 శాతంగా ఉంది. గతేడాది
శ్రీలంక, వియత్నాంలో డెలివరీ సెంటర్‌లను కంపెనీ
ప్రారంభించింది. రాబోయే 18 నెలల్లో శ్రీలంకలో సుమారు 1,500,
వచ్చే మూడేళ్లలో వియత్నాంలో 3,000కు పైగా
నియామకాలను చేపట్టనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది
0 Komentar