HCL to hold two-day virtual mega job
drive at campus near Vijayawada
హెచ్‌సిఎల్ రిక్రూట్‌మెంట్ - 2021: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వర్చువల్ నియామకాలు
1,000 మందికి అవకాశం
వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్
వెల్లడి
ఐటీ రంగంలో ఉపాధి పొందాలనే ఆసక్తి
కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇతరులకు స్థానికంగానే
ఉపాధి కల్పించే (స్టే రూటెడ్) పథకాన్ని విజయవాడ కేంద్ర పరిధిలో మరింతగా అమలు
చేస్తున్నట్లు హెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని సంస్థ అమలు చేస్తోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వర్చువల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని గన్నవరంలోని
హెచ్‌సీఎల్ కేంద్రంలో జనవరి 28న నిర్వహించిన విలేకరుల
సమావేశంలో ఆమె తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ డ్రైవ్
జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన,
ఐటీ రంగంలో అనుభవం ఉన్న 1,000 మందిని ఈ
విధానంలో ఎంపిక చేసి, ఏడాది పాటు శిక్షణ ఇస్తామని, తదుపరి వారికి సంస్థల్లో అవకాశాలు కల్పిస్తామని వివరించారు. శిక్షణకు
రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనుభవజ్ఞులకు జావా, చిప్
డిజైనింగ్, డాట్‌నెట్ తదితర అంశాలపై టెస్ట్‌లు
నిర్వహిస్తామన్నారు.
ఫిబ్రవరి 11
లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
0 Komentar