మీ బంధువులును, స్నేహితులను సిగ్నల్ యాప్ లోకి ఆహ్వానించండం ఎలా..?
వాట్సాప్ 2021లో కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై చాలా విమర్శలు వస్తున్నాయి. దింతో చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మరింత సెక్యూరిటీ అందించే సిగ్నల్ యాప్ వాడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
సిగ్నల్ యాప్ లో తమ బంధువులును, మిత్రులను ఇందులో ఎలా యాడ్ చేయాలో చూద్దాం.
యూజర్లు వాట్సాప్ తరహాలోనే సులభంగా మీ మిత్రులను ఇందులోకి జోడించవచ్చు. మీ మిత్రులు కూడా సిగ్నల్ యాప్ వాడుతుంటే మీ పని ఇంకా చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు, మీరు సిగ్నల్ యాప్లో కుడి ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. షేర్ విత్ కాంటాక్ట్స్ లేదా చూస్ హౌ టూ షేర్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు హౌ టూ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కనిపిస్తున్న లింకును ఇతర గ్రూప్ లలో షేర్ చేసి ఆహ్వానించవచ్చు.
0 Komentar