Income Tax Calendar 2021: All Important
Deadlines You Should Know
కొత్త ఏడాదిలో మనం పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వీటికి కొన్ని డెడ్‌లైన్స్ ఉన్నాయి. ఈ గడువు తీరిగే జరిమానా పడుతుంది. లేదంటే ఆ పనులు పూర్తి చేయడానికి, ప్రయోజనం పొందటానికి వీలుండదు.
ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. 2021లో మనం కొన్ని తేదీలను
కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ ఏడాదిలో ఫైనాన్షియల్
డెడ్‌లైన్స్ ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం పలు అంశాలకు సంబంధించి
గడువు పొడిగించడం ఇందుకు కారణం.
2021 క్యాలెండర్ ఇయర్ మనం పూర్తి చేయాల్సిన ఆర్థిక గడువులు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
✺ జనవరి 10 - ఇన్‌కమ్
ట్యాక్స్ రిటర్న్ దాఖలు ITR Filing (ఐటీఆర్ ఫైలింగ్) డెడ్‌లైన్
ముగుస్తుంది.
✺ జనవరి 15 - ట్యాక్స్
ఆడిట్ రిపోర్ట్‌లను ఈ తేదీలోగా సమర్పించాలి.
✺ జనవరి 31 - వివాద్ సే
విశ్వాస్ స్కీమ్ కింద డిక్లరేషన్ ఇవ్వడానికి ఇదే చివరి తేదీ.
✺ ఫిబ్రవరి 15 - ఆడిట్
చేయాల్సిన అకౌంట్లు కలిగిన వారు ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈరోజుతో గడువు
ముగుస్తుంది.
✺ ఫిబ్రవరి 28 - పెన్షన్
పొందే వారు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఇదే చివరి తేదీ.
✺ మార్చి 15 - అడ్వాన్స్
ట్యాక్స్ పేమెంట్స్‌కు ఈరోజు గడువు ముగుస్తుంది.
✺ మార్చి 31 - పాన్
ఆధార్ నెంబర్ల అనుసంధానికి చివరి తేదీ ఇదే. ఇంకా ఎల్‌టీసీ వోచర్ స్కీమ్ కింద
ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి కూడా ఈరోజు గడువు ముగుస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ లేదంటే ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు
చేయడానికి కూడా ఈరోజు డెడ్‌లైన్ ముగుస్తుంది. 2020-21 ఆర్థిక
సంవత్సరానికి ట్యాక్స్ సేవింగ్ పనులు పూర్తి చేయడానికి కూడా గడువు ముగుస్తుంది.
వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కింద చెల్లింపులకు డెడ్‌లైన్ ఇదే. ఎమర్జెన్సీ క్రెడిట్
లైన్ గ్యారంటీ స్కీమ్ ఈరోజు తర్వాత ఉండదు. పీఎంఏవై స్కీమ్ కింద క్రెడిట్ సబ్సిడీ
బెనిఫిట్ పొందేందుకు కూడా ఈరోజుతో టైమ్ అయిపోతుంది.
✺ జూన్ 30 - కొత్త ఇంటి కొనుగోలుపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందేందుకు ఈరోజు గడువు ముగుస్తుంది.
✺ జూలై 31 - 2020-21 ఆర్థిక
సంవత్సరానికి ఐటీఆర్ దాఖలుకు ఈ రోజుతో గడువు తీరుతుంది.
0 Komentar