Indian Air Force Airmen (Group X &
Y) Recruitment 2021
ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఎయిర్ మెన్
పోస్టులు:
* గ‌్రూప్-ఎక్స్(ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ ట్రేడ్ మినహాయించి)
* గ్రూప్-వై (ఐఏఎఫ్(ఎస్) & మ్యూజిషియన్ ట్రేడ్ మినహాయించి)
* గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
అర్హత:
1) గ‌్రూప్-ఎక్స్(ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ ట్రేడ్ మినహాయించి): కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన అర్హతలో భాగంగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా ఉన్న కోర్సులో ఉత్తీర్ణత.
2) గ్రూప్-వై (ఐఏఎఫ్(ఎస్) & మ్యూజిషియన్ ట్రేడ్ మినహాయించి): కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
3) గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్): కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన అర్హతలో భాగంగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులుగా ఉన్న కోర్సులో ఉత్తీర్ణత.
* గ్రూప్ ‘ఎక్స్’ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు (ఇంటర్మీడియట్ / 10 + 2 ఆధారంగా) గ్రూప్ ‘వై’కి సైతం అర్హులు అవుతారు.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నింపే సమయంలో ఒకే సిట్టింగ్‌లో గ్రూప్ ‘ఎక్స్’, గ్రూప్ ‘వై’ పరీక్ష రెండింటిలోనూ కనిపించే అవకాశం ఉంటుంది.
* డిప్లొమా అభ్యర్థులు గ్రూప్ X ట్రేడ్‌కు మాత్రమే హాజరు కావడానికి అర్హులు.
వయసు: 21 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: శరీర దారుఢ్య పరీక్ష, మెడికల్ పరీక్ష, ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
1) గ‌్రూప్-ఎక్స్(ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ ట్రేడ్ మినహాయించి) పోస్టులకు నిర్వహించే పరీక్ష సమయం 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రశ్నలు ఇస్తారు.
2) గ్రూప్-వై (ఐఏఎఫ్(ఎస్) & మ్యూజిషియన్ ట్రేడ్ మినహాయించి) పోస్టులకు నిర్వహించే పరీక్ష సమయం 45 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఇస్తారు.
3) రెండు ట్రేడ్‌లకు పరీక్ష రాసే అభ్యర్థులకు 85 నిమిషాలు సమయం ఇస్తారు. అందులో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు అడుగుతారు.
* ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కు డిడక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2021.
దరఖాస్తులకు చివరి తేది: 07.02.2021.
0 Komentar