Intermediate Admissions 2020-21:
ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు
నేటి నుంచి
ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు
ఇంటర్ విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు
కళాశాలల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మండలి కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు.
ప్రవేశాల సమయంలో పదోతరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, కుల
ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన వెంటనే విద్యార్థులకు వెనక్కి ఇచ్చేయాలని, వాటిని తీసుకుంటే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు గురువారం నుంచి
దరఖాస్తులను విక్రయించనున్నారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ,
దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.200. ఇప్పటికే ఆన్‌లైన్ ప్రవేశాల కోసం రుసుము చెల్లించినవారు ఎలాంటి
చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఫీజు చెల్లింపు రశీదును ప్రిన్సిపాళ్లకు
చూపిస్తే సరిపోతుంది. ఈ నెల 17లోపు దరఖాస్తులను కళాశాలలకు
సమర్పించాల్సి ఉంటుంది. ఆరోజుతో ప్రవేశాలను పూర్తి చేసి 18నుంచి
తరగతులు ప్రారంభిస్తారు.
First Phase of Schedule of Admissions
Sale of application forms: 07.01.2021
(THURSDAY)
Last date for receipt of applications in
the College: 17.01.2021 (SUNDAY)
Date of completion of admissions: 17.01.2021
(SUNDAY)
Date of commencement of classes
for 1st year: 18.01.2021 (MONDAY)
0 Komentar