ఈసారీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రెండున్నర లక్షల మందికే అనుమతి
వచ్చే విద్యా సంవత్సరం (2021-22) ఐఐటీల్లో ప్రవేశానికి జులై 3న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 రాసేందుకు రెండున్నర లక్షల మంది విద్యార్థులనే అనుమతించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయించి వారిని మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు. ఆ సంఖ్యను కొన్నేళ్లుగా పెంచుతూ వస్తున్నారు. 2018లో 2.30 లక్షలు, 2019లో 2.45 లక్షలు, 2020లో 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రకారం ఈసారి మరికొంత పెరగవచ్చని నిపుణులు అంచనా వేయగా.. 2021కి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్ తాజాగా అదే సంఖ్యను ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 40వేల మంది వరకు అర్హత సాధిస్తున్నారు. గత ఏడాది 2.50 లక్షల మందికి అవకాశం ఇచ్చినా పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసింది 1,60,838 మందే. అందుకే ఈసారి విద్యార్థుల సంఖ్యను పెంచకపోయి ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
4 దేశాల్లో పరీక్షా
కేంద్రాలు
ఈసారి భారత్‌తోపాటు దుబాయ్(యూఏఈ), ఢాకా(బంగ్లాదేశ్),
కఠమాండూ(నేపాల్), సింగపూర్‌లో కూడా పరీక్షా
కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ బుధవారం జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌ను
అందుబాటులోకి తెచ్చింది.
0 Komentar