జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీలపై స్పష్టత - కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్డ్స్ తేదీలను జనవరి 7న ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌పోఖ్రియాల్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన జనవరి 4న ట్విటర్‌లో పోస్టు చేశారు. జనవరి 7న జరిగే ‘లైవ్ డిస్కషన్’లో ఈ తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అదే చర్చలో ఐఐటీల్లో అడ్మిషన్ ప్రక్రియ, ప్రవేశ అర్హతల గురించి స్పష్టతనివ్వనున్నట్లు తెలిపారు. తాజాగా జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష తేదీలను వెల్లడించారు. ‘‘ప్రియమైన విద్యార్థులారా, జనవరి 7వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఐఐటీ అడ్మిషన్లు, జేఈఈ అడ్వాన్డ్స్ తేదీలను ప్రకటిస్తాను’’ అని పోఖ్రియాల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. కరోనా కారణంగా జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత పొందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయలేకపోయారు. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021లో నేరుగా పరీక్ష రాసేందుకు వారికి అవకాశం కల్పించారు. కరోనా కారణంగా పలు సాధారణ వార్షిక పరీక్షలు, జాతీయ ప్రవేశ పరీక్షలు జరగకపోవడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి చర్చించారు.
0 Komentar