JEE Main: 75% Marks
in Class 12th Not Mandatory for NIT, IIIT and GFTI
Admission 2021
జేఈఈ మెయిన్స్:75%మార్కుల నిబంధన లేదు
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో
ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
తీసుకుంది. ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈసారి 12వ
తరగతిలో 75శాతం మార్కుల తప్పనిసరి నిబంధనను సడలిస్తున్నట్టు
స్పష్టంచేసింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విటర్‌లో
వెల్లడించారు. కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థ (సీఐఎఫ్‌టీ)లైన ఐఐటీ, ఎన్‌ఐటీ, తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం పోటీ
పడే విద్యార్థులు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో అర్హత సాధించడంతో పాటు,
12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75 శాతం
మార్కులు సాధించాలనే నిబంధన గతంలో ఉండేది. అయితే, కరోనా
సంక్షోభం నేపథ్యంలో గతేడాది ఈ నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా
సవరించిన నిబంధనల ప్రకారం ఆయా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీటు లభించాలంటే
జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించడంతో పాటు 12వ తరగతి
పరీక్ష పాసైతే చాలు. 12వ తరగతిలో 75శాతం
మార్కులు సాధించాలన్న నిబంధనను రద్దు చేశారు. మరోవైపు, ఈ
ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలు నాలుగు విడతలుగా జరగనున్నాయి. తొలి రౌండ్ పరీక్షలు
ఫిబ్రవరి 23, 26 తేదీల్లో జరగ్గా.. రెండో విడత పరీక్షలు
ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు, మూడో విడత పరీక్షలు ఏప్రిల్ 27 - 30 తేదీల్లో,
నాలుగో విడత పరీక్షలు మే 24 నుంచి 28 తేదీల మధ్య జరగనున్న విషయం తెలిసిందే.
0 Komentar