National Girl Child Day 2021: Theme,
Importance and Significance
జాతీయ బాలికల దినోత్సవం 2021: థీమ్
మరియు ప్రాముఖ్యత
బాలికల సంరక్షణ, సంపూర్ణ
ఎదుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం 2008 నుండి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ
బాలికా దినోత్సవం నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల హక్కులు, ఆరోగ్యం,
విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈరోజు అవగాహన
కల్పిస్తోంది.
Theme:
The objective of raising
awareness on the issue of declining Child Sex Ratio (CSR)
క్షీణిస్తున్న చైల్డ్ సెక్స్
రేషియో (సిఎస్ఆర్) సమస్యపై అవగాహన పెంచే లక్ష్యం
‘బేటీ బచావో.. బేటీ పడావో’
ఈ సందర్భం లో ‘బేటీ బచావో.. బేటీ
పడావో' పథకం 6 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం విశేషం.
బాలికల సంరక్షణలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘బేటీ బచావో.. బేటీ పడావో'పథకాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల బాలికల చదువు, వారి పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు.
అమ్మాయిల సంఖ్య పెంచేందుకు.. మన దేశంలో దాదాపు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 940 మంది అమ్మాయిలే ఉన్నారు. అంటే బాలికల సంఖ్య మరింత పెంచాలని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితం మాత్రం కొంతవరకే వస్తోంది.
ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ఉంటే చాలు.. తన తోబుట్టువులకు మరో తల్లి ఉన్నట్టే. తను తన సోదరులను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. జీవితాంతం వారికి అవసరమైన అండను అందిస్తూ అమ్మ కాని అమ్మగా మారుతుంది.
20 ఏళ్లు కూడా నిండని యువతి ఒక్క
రోజు సీఎం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతికి అలాంటి అరుదైన అవకాశమే దక్కింది. జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుంది. సీఎంగా ఒక్క రోజు విధులు నిర్వహించనుంది. ఆ అమ్మాయి పేరు సృష్టి గోస్వామి.
0 Komentar