NEET PG 2021 Exam Date Announced, Check
Details Here
నీట్ పీజీ పరీక్ష తేదీలు ఖరారు..
పూర్తి వివరాలివే
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
నీట్ పీజీ 2021 పరీక్షల తేదీలను వెల్లడించింది.
నీట్ పీజీ 2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ 2021 పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఎగ్జామ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
నీట్ పీజీ 2021 పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. అవసరమైన ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. ఇతర వివరాల కోసం https://nbe.edu.in/ లేదా https://natboard.edu.in/ వెబ్‌సైట్‌లను సందర్శించొచ్చు.
ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 6,102 ఇన్‌స్టిట్యూషన్స్‌లో 10,821 (మాస్టర్ ఆఫ్
సర్జరీ-ఎంఎస్), 19,953 (డాక్టర్ ఆఫ్ మెడిసిన్-ఎండీ)
సీట్లను భర్తీ చేస్తారు.
0 Komentar