Netaji Subhas Chandra Bose Birthday to
Be Celebrated As 'Parakram Diwas' Every Year
‘పరాక్రమ దివస్’గా నేతాజీ సుభాష్
చంద్రబోస్ జయంతి
====================
ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన బుల్లెట్‌గా అభివర్ణించే స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఏటా ఘనంగా నివాళులర్పించేందుకే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన జన్మదినమైన జనవరి 23న ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్’గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘‘భారతీయుల ప్రియతమ నేత, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించాం. 2021 నుంచి ఆయన జయంతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘పరాక్రమ దివస్’గా నిర్వహించనున్నాం. దేశ ప్రజల్లో ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపి వారిలో నేతాజీ వలే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు ఈసారి ఆయన జయంతికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అప్పట్లో నేతాజీకి కార్యస్థలంగా ఉన్న కోల్‌కతాలో.. ఈ జనవరి 23న ఆయనకు నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన భాజపా కార్యకర్తలను విడిగా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు అదే రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం తీవ్ర మాటలయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
1897వ సంవత్సరం జనవరి 23వ తేదీన ఒడిశాలోని కటక్‌లో నేతాజీ జన్మించారు. తండ్రి జానకీ నాథ్. తల్లి
ప్రభావతీ బోస్, చిన్న నాటి నుంచే చదువులో రాణించిన నేతాజీ..
రామకష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో
పయనించారు. అనంతరం స్వాతంత్ర్య పోరాటం వైపు అడుగులు వేశారు. గాంధీ అహింసా మార్గం
ఆంగ్లేయులకు అర్థం కావడం లేదని భావించిన ఆయన.. భారతదేశానికి సైనికరీతిన
స్వాతంత్ర్యం సంపాదించాలని ఆకాంక్షించారు.
====================
0 Komentar