Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Netaji Subhash Chandra Bose Birth Anniversary - Interesting Things and Biography

 

Netaji Subhash Chandra Bose Birth Anniversary - Interesting Things and Biography

నేతాజీ సుభాష్ చంద్రబోస్.. వర్ధంతి లేని మహావీరుని జయంతి

====================

సాయుధ పోరాటమే ధ్యేయమని, స్వాతంత్ర భారతావని మన స్వప్నమని బలంగా నమ్మి.. ఇందుకు ప్రతి భారతీయుడు సైనికుడిగా మారి ప్రాణాలర్పించాలని నేతాజీ పిలుపునిచ్చారు. 

నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం... మరణం లేని అమరుడు.. భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు.. స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన మహావీరుడు.. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన యోధుడు. 

రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ బలంగా నమ్మారు. ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.

బోస్ గారి జన్మదినమైన జనవరి 23న ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్‌’గా జరపాలని 2021 లో భారత ప్రభుత్వం నిర్ణయించింది.   

స్వాతంత్రం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరిన నేతాజీ.. బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అహింసామార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941లో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ముకొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. 

====================

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర తెలుగులో

పరాక్రమ దివస్‌’గా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags