Application Date Extended
జేఈఈ మెయిన్ అభ్యర్థులకు హెచ్చరిక జారీ చేసిన ఎన్‌టీఏ మరియు అప్లికేషన్ తేదీ పొడిగింపు
NTA JEE MAINS 2021: జేఈఈ మెయిన్స్-2021 పరీక్షకు సంబంధించి ఎన్‌టీఏ కీలక హెచ్చరిక జారీ చేసింది.
జేఈఈ మెయిన్-2021 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈదఫా నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించే ఈ పరీక్షను ఈసారి నాలుగు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో జరగబోయే తొలి విడత పరీక్షకు డిసెంబరు 15 నుంచి దరఖాస్తులను ఎన్‌టీఏ ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
అయితే జేఈఈ పరీక్షల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఫేక్ వెబ్‌సైట్‌లు చలామణీ అవుతున్నట్లు ఎన్‌టీఏ హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు ఫీజు చెల్లించడం, రిజిస్ట్రేషన్ తదితర విషయాల్లో ఫేక్ వెబ్‌సైట్ల జోలికి పోకుండా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ లోనే రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడం వంటి కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపింది. సందేహాలు, ఫిర్యాదులు ఏవైనా grivance@nta.ac.in మెయిల్‌కు సమాచారం అందించాలని పేర్కొంది.
నాలుగు సార్లు:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది తీసుకున్న జాగ్రత్తలే వచ్చే ఏడాదిలో జరిగే పరీక్షల్లోనూ విద్యార్థులు పాటించాలని స్పష్టంచేసింది. తొలి విడత పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తామని తెలిపిన ఎన్టీఏ.. మార్చి, ఏప్రిల్, మే నెలలో మరో మూడు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షలను విద్యార్థులు ఒకేసారి రాయొచ్చు లేదా నాలుగు సార్లయినా రాసేందుకు వెసులుబాటు కల్పించింది.
ఒకవేళ నాలుగు సార్లు రాసినా ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోనున్నారు. మే తర్వాత లేదా జూన్ చివరి వారంలో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇక సిలబస్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా.. యథాతథంగా ఉండనుంది.
షెడ్యూల్ ఇలా:
డిసెంబరు 15
నుంచి జనవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ
ఫీజు చెల్లింపునకు జనవరి 24వరకు
తుదిగడువు
దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు
జనవరి 27 నుంచి 30 వరకు అవకాశం
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు
ఫిబ్రవరి రెండవ వారంలో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం
తొలి పరీక్షను ఫిబ్రవరి 22
నుంచి 25వ తేదీ వరకు నిర్వహణ
పరీక్షను రోజుకు రెండు షిఫ్టుల్లో
(ఉదయం 9
నుంచి 12; మధ్యాహ్నం 3 నుంచి
6 వరకు) నిర్వహించనున్నారు.
NOTICE
ON APPLICATION SUBMISSION EXTENSION DATE
0 Komentar