ఇంటర్‌లో ‘ఇంప్రూవ్‌మెంట్’ అవకాశం - ఫీజు గడువు వచ్చేనెల 11
ఇంటర్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలను ‘ఇంప్రూవ్‌మెంట్’ కింద రాసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలతో పాటే జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షల్లోనే ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవడానికి ఇంటర్ విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా పబ్లిక్ పరీక్షలతో పాటు ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. సప్లిమెంటరీలోనే ఉంటుంది. కానీ కొవిడ్-19 కారణంగా ఈసారి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పబ్లిక్ పరీక్షల సమయంలో ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి తెలిపింది. విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌లో ఎక్కువ మార్కులు సాధించి ఉన్నతవిద్య ప్రవేశాల్లో ప్రయోజనం పొందుతున్నారు. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులొస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫీజు రూ.490 కాకుండా ఇంప్రూవ్‌మెంట్ కోసం అదనంగా ప్రతి సబ్జెక్టుకూ రూ.160 చొప్పున చెల్లించాలని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
పబ్లిక్ పరీక్షల ఫీజును వచ్చేనెల 11లోగా చెల్లించాలి. ఫీజు
చెల్లింపు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. ఇతర వివరాలను కళాశాలల
ప్రిన్సిపాళ్ల నుంచి పొందొచ్చు.
0 Komentar