ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ - పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పద్మవిభూషణ్‌తో కేంద్రం గౌరవించింది. పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారిలో జాబితాలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే (కర్ణాటక), సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో కర్ణాటకకు చెందిన నరీందర్‌సింగ్ కపనే (మరణానంతరం- అమెరికా), మౌలానా వహిదుద్దీన్‌ఖాన్ (దిల్లీ), బీబీ లాల్ (దిల్లీ), సుదర్శన్ సాహూ (ఒడిశా) ఉన్నారు.
తెలుగు పద్మాలు వీరే..
తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి నలుగురిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ఒక్కరు ఉన్నారు. ఏపీ నుంచి రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్‌రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఉండగా.. తెలంగాణకు చెందిన కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ దక్కింది.
ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్
ఇద్దరు మాజీ సీఎంలకు పద్మభూషణ్
ఈ ఏడాది 10 మందికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించగా.. దీంట్లో ఇటీవల మరణించిన ముగ్గురు రాజకీయ ప్రముఖులను ఎంపికచేసింది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్, అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్, బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాసవాన్ ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుతం రాజకీయ రంగంలో సేవలందిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, హరియాణాకు చెందిన తర్లోచన్ సింగ్‌కు పద్మభూషణ్ ప్రకటించారు. కేరళకు చెందిన కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర (ఆర్ట్), కర్ణాటకు చెందిన చంద్రశేఖర్ కంబారా (సాహిహత్యం, విద్య), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నృపేంద్ర మిశ్రా (సివిల్ సర్వీస్), యూపీకి చెందిన కాల్బే సాధిక్ (ఆధ్యాత్మికం), మహారాష్ట్రకు చెందిన రజనీకాంత్ దేవిదాస్ ష్రాఫ్ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)కు పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించారు.
ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ
ఈ ఏడాది క్రీడా రంగానికి చెందిన ఏడుగురిని పద్మశ్రీ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో వీరేందర్‌సింగ్ (హరియాణా)తో పాటు పి.అనిత (తమిళనాడు), మౌమదాస్ (బెంగాల్), అన్షు జమ్సెన్పా (అరుణాచల్‌ప్రదేశ్), మాధవన్ నంబియార్ (కేరళ), సుధా హరినారాయణ్ సింగ్ (యూపీ), కేవై వెంకటేశ్ (కర్ణాటక) ఉన్నారు.
‘పద్మ’ పురస్కారాలు -2021 పూర్తి జాబితా ఇదీ..👇
0 Komentar