Payment of the Examination fee for 2nd
year Inter Regular and ex-students (General and Vocational)
ఫిబ్రవరి 11లోగా ఇంటర్ పరీక్షఫీజు చెల్లించాలి
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు ను ఎటువంటి అపరాధ రుసుంలేకుండా ఫిబ్రవరి 11లోగా చెల్లించాలని ఇంటర్నీడియట్ విద్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్ఐఓ వీవీ.సుబ్బారావు తెలిపారు. పరీక్ష దరఖాస్తు ఫారం రూ.10, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు రూ.490, సైన్సు విద్యార్థులు రూ.880 పరీక్ష ఫీజు చెల్లించాలి మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం కేవలం థియరీ పేపర్లకు రూ.450 షీజు చెల్లించాలి. పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు హాజరయ్యే ఆర్ట్స్ విద్యార్థులు రూ.380, సైన్సు విద్యార్థులు రూ. 1170 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు రూ.680 చెల్లిం చాలి. జనరల్, ఒకేషనల్ ప్రాక్టికలకు రూ.190 చెల్లించాలి.
ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయి ప్రాక్టికల్స్ కు మాత్రమే హాజరయ్యే విద్యార్థులు రూ.190, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జికోర్సు పరీక్షకు రూ.185 ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఓకేషనల్ బ్రిడ్డి కోర్సులకు రూ.270 చెల్లించాలి.
ప్రథమ, ద్వితీయ
సంవత్సరాలు పరీక్షలు పాసై ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షకు హాజరయ్యే ఆర్ట్స్
విద్యార్థులు రూ. 1170, సైన్సు విద్యార్థులు రూ.1360 పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం ప్రకటిం చిన షెడ్యూలు ప్రకారం అందరూ
పరీక్ష ఫీజు చెల్లించాలని ఆర్ ఐఓ సుబ్బారావు తెలిపారు.
0 Komentar