PJTSAU UG 2nd Phase Counselling 2020-21
Combined Counselling Dates Details
రేపటి నుంచి అగ్రి కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్.. పూర్తి వివరాలివే
వ్యవసాయ, వెటర్నరీ,
ఉద్యాన కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటి (జనవరి
9 ) నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 9
నుంచి 12 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్ల
జయశంకర్ వర్సిటీ అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు అర్హులైన విద్యార్థుల
వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.pjtsau.edu.in/ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు
హాజరుకానివారు కూడా రెండో విడతలో పాల్గొనవచ్చని వెల్లడించారు.
దేశంలో వ్యవసాయ విద్యకు రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతుండటంతో యువత క్రమంగా ఆటువైపు మొగ్గుచూపుతోంది. అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల విషయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచే అపారమైన ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తుండటం.. ప్లేస్‌మెంట్స్ పరంగా చూసినా.. ఉన్నత విద్య, పరిశోధనల దృష్టితో ఆలోచించినా.. అనేక ప్రయోజనాలు లభిస్తుండటంతో వ్యవసాయ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు.
0 Komentar