PNB Recruitment 2021: 100 Vacancies for
Manager Posts
పీఎన్‌బీలో 100 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), హెచ్ఆర్ఎం విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
* మేనేజర్-సెక్యూరిటీ పోస్టులు
* మొత్తం ఖాళీలు: 100
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జనవరి 01, 2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
వయసు సడలింపు: ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.48170 - రూ.69810 వరకు చెల్లిస్తారు.
కేటగిరీల వారీగా ఖాళీలు:
1. ఎస్సీ కేటగిరీ - 15
2. ఎస్టీ కేటగిరీ - 08
3. ఓబీసీ కేటగిరీ - 27
4. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ - 10
5. జనరల్ కేటగిరీ - 40
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నైపుణ్యాలను నిర్ధారించడానికి ఇంటర్వ్యూలో భాగంగా ఒక వ్యాసం / లేఖ సంబంధించిన పరీక్ష నిర్వహిస్తారు.
* పరీక్షలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి.
* అభ్యర్థులు బ్యాంక్ సేవ, ప్రవర్తన నియమాలు, విధానాలకు లోబడి ఉండాలి.
* అభ్యర్థులు నియామక సమయంలో ఇండెంనిటీ బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500/-.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్ లింక్‌కు లాగిన్ అవ్వాలి.
* అందులో దరఖాస్తు ఫారమ్‌ను
డౌన్‌లోడ్ చేసి కింద తెలిపిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజుకు సంబంధించిన వోచర్‌కాపీతో కలిపి స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Chief Manager (Recruitment Section), HRM Division, Punjab National Bank, Corporate Office plot no 4, Sector 10, Dwarka , New Delhi - 110075.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2021.
దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేది: 13.02.2021
దరఖాస్తుకు చివరి తేది: 15.02.2021.
0 Komentar