Pulse Polio Program Postponed
పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా
ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు
నిర్వహించాల్సిన పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర
ప్రభుత్వం వాయిదా వేసింది. కార్యక్రమం మళ్లీ నిర్వహించే తేదీని త్వరలోనే
వెల్లడిస్తామని చెప్పింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
జాతీయ ఇమ్యునైజేషన్ సలహాదారు ప్రదీప్ హల్డర్ రాష్ట్రాలకు సమాచారం అందించారు.
కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఈ నెల 16 నుంచి పంపిణీ చేయనున్న విషయం
తెలిసిందే. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పల్స్ పోలియా కార్యక్రమాన్ని
వాయిదా వేసినట్లు తెలుస్తోంది. టీకా పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు
పాల్గొనున్నారు. దీంతో వ్యాక్సినేషన్‌కు సిబ్బంది కొరత ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ
నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
0 Komentar