Rafale To Feature in Republic Day Parade
for First Time
గణతంత్ర వేడుకల్లో సందడి చేయనున్న
రఫేల్
భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి సందడి చేయనుంది. జనవరి 26న దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక రఫేల్ యుద్ధ విమానం పాల్గొని ‘వర్టికల్ ఛార్లీ’ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సోమవారం వెల్లడించింది. వర్టికల్ ఛార్లీ ఫార్మేషన్‌లో యుద్ధవిమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈ సారి గణతంత్ర వేడుకల్లో వాయుసేకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు.
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ 2016లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్ విమానాలు గత నెల భారత్ చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో ఉన్నాయి.
0 Komentar