Railways extends time to claim refund
for cancelled trains
9 నెలల వరకు టికెట్లు రద్దు
చేసుకోవచ్చు - మార్చి-జూన్ మధ్య రద్దయిన రైళ్లకే వర్తింపు
కరోనా మహమ్మారిని దృష్టిలో
ఉంచుకొని నిరుడు మార్చి 21 నుంచి జూన్ 31 మధ్య
రైల్వే కౌంటర్లలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని
రైల్వేశాఖ తీసుకుంది. కరోనా కారణంగా ఆ సమయంలో రైళ్లు రద్దయిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆ ప్రయాణికులకు టికెట్లు రద్దు చేసుకొనేందుకు ఆరునెలలు గడువిచ్చిన
రైల్వేశాఖ.. ఇప్పుడు ఆ సమయాన్ని తొమ్మిది నెలలకు పొడిగించింది. ‘‘పీఆర్‌ఎస్
కౌంటర్లలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు.. ప్రయాణ తేదీ నుంచి తొమ్మిది నెలల
సమయంలో ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. సాధారణ షెడ్యూల్డ్ రైలు ప్రయాణికులకు
మాత్రమే ఇది వర్తిస్తుంది’’ అని రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
0 Komentar