RBI Recruitment 2021 for 241 Security
Guard Posts Across India
ఆర్‌బీఐలో 241 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో (బ్యాంకుల్లో) సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* సెక్యూరిటీ గార్డులు
* మొత్తం ఖాళీలు: 241
అర్హత: సంబంధిత రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు నుంచి పదోతరగతి (ఎస్ఎస్‌సీ/ మెట్రిక్యులేషన్)/ తత్సమాన ఉత్తీర్ణత. మిలిటరీ సర్వీస్ ముందు లేదా తరువాత రిక్రూట్‌మెంట్ జోన్ బయట నుండి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు.
వయసు: 01.01.2021 నాటికి 25-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కేవలం అర్హత కోసం మాత్రమే నిర్వహిస్తారు. తుది ఎంపిక ఆన్‌లైన్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. వారికి ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఆన్‌లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. కింద సూచించిన విధంగా వివిధ విభాగాలకు కేటాయించిన మార్కులు, ప్రశ్నల సంఖ్య ఉంటుంది.
1) టెస్ట్ ఆఫ్ రీజనింగ్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు
2) జనరల్ ఇంగ్లిష్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు
3) న్యూమరికల్ ఎబిలిటీ - 30 ప్రశ్నలు - 30 మార్కులు
* పరీక్షా సమయం 80 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్, సెక్షనల్ కటాఫ్ ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2021.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: 12.02.2021.
0 Komentar