Recruitment of Various Posts at National
Testing Agency (NTA)
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ ప్రోగ్రామర్, ప్రోగ్రామర్, సీనియర్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్, రిసెర్చ్ సైంటిస్ట్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఒప్పంద ప్రాతిపదిక పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను రాత పరీక్షకు 70 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ కమ్ సూటబిలిటీ టెస్ట్‌కు 30 మార్కులు కేటాయించారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలు, పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 18.02.2021.
0 Komentar