Republic Day 2021: What’s
New, What Will Be Missing in Jan 26 Parade
ఈ సంవత్సరం జరిగే గణతంత్ర వేడుకలలో
ప్రత్యేకతలు ఇవే
ఈసారి జరిగే 72వ గణతంత్ర దినోత్సవ
వేడుకలు చాలా భిన్నంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ కరోనా మహమ్మారే
కారణం. కరోనా వైరస్ కారణంగా ఈ సారి గణతంత్ర వేడుకలు కొంత సాధారణంగా జరిగే అవకాశం
ఉండొచ్చు.
ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశీ అతిథులుండరు
సాధారణంగా ప్రతి గణతంత్ర దినోత్సవ
వేడుకలు ఏదో ఒక దేశం నుండి ఎవరో ఒక అధినేత వచ్చి, ఢిల్లీలో జరిగే
పరేడ్ పాల్గొని, భారత ఆర్మీ యొక్క గౌరవ వందనం
స్వీకరించేవారు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా విదేశీ అతిథులు ఎవ్వరికీ
ఆహ్వానం లేదు. కాబట్టి ఈసారి ఇతరదేశాల నుండి ఎవ్వరూ పాల్గొనరు.
గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథి హాజరుకాక పోవడం చరిత్రలో ఇది నాల్గవసారి. ఇది చివరిసారిగా 1966 లో జరిగింది, దీనికి ముందు 1953 మరియు 1952 లో జరిగింది. భారతదేశంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఏటా విదేశీ నేతలు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా అతిథులెవరూ లేకుండా మనం వేడుకలను జరుపుకోనున్నాం.
స్నేహపూర్వక సంబంధాల కోసం
భారతదేశం తన విదేశీ వ్యవహరాలు మరియు దౌత్య సంబంధాలలో ఎల్లప్పుడూ చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఇతర దేశాలతో సంబంధాలను పెంచుకునేందుకు మరింత స్నేహపూర్వకంగా ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. కానీ తను ఆ పర్యటనను రద్దు చేసుకున్నాడు.
బంగ్లాదేశ్ సైన్యం భాగం
మన దేశం నుండి 1971లో విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర రాష్ట్రంగా మారిన సంగతి అందరికీ
తెలిసిందే. అయితే అలా విడిపోయి ప్రస్తుతం 50 సంవత్సరాలు
అయ్యాయి. ఈ సందర్భంగా మన దేశంలో జరిగే రిపబ్లిక్ డే కవాతులో బంగ్లాదేశ్ సైన్యం
కూడా పాల్గొనబోతోంది.
ఇలా భారతదేశ సైన్యంతో కలిసి
విదేశీయుల సైన్యం పాల్గొనడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం మన భారత సైన్యంతో కలిసి కవాతులో పాల్గొంది.
కవాతులో మార్పులు
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహించేవారు. అదే సమయంలో భారీ ఎత్తున సైన్యం కవాతు కార్యక్రమాలను నిర్వహించేది. కానీ ఈసారి కరోనా కవాతులను చిన్నవిగా చేస్తున్నారు.
నేషనల్ స్టేడియంలో
ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకల
సమయంలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఉపన్యసించే ప్రధాన మంత్రి ఈసారి
నేషనల్ మైదానంలో పాల్గొననున్నారు. అలాగే పరేడ్ లో పాల్గొనే అన్ని స్క్వాడ్ లలో 144 మందికి బదులు 96 మంది మాత్రమే పాల్గొంటారు. సందర్శకుల
గ్యాలరీ కూడా ఈసారి నాలుగో వంతు మాత్రమే ఉంటుందట.
0 Komentar